Headlines

Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?

Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?


Indian Railways: మనం రైలు ప్రయాణం చేయడానికి టికెట్ బుక్ చేసిన ప్రతిసారీ PNR నంబర్ అనే పదాన్ని చూస్తూనే ఉంటాం. చాలామంది దీనిని కేవలం టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి వాడే ఒక సాధారణ సంఖ్యగా మాత్రమే భావిస్తారు. కానీ, ఈ 10 అంకెల PNR నంబర్ వెనుక మీ మొత్తం ప్రయాణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన డేటా దాగి ఉంటుందని మీకు తెలుసా..?

PNR అంటే ఏమిటి?

PNR అనగా Passenger Name Record (ప్యాసింజర్ నేమ్ రికార్డ్). ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) డేటాబేస్‌లో ప్రతి రిజర్వ్‌డ్ టికెట్‌కు కేటాయించే ప్రత్యేకమైన (Unique) గుర్తింపు సంఖ్య ఇది.

ఈ 10 అంకెల PNR నంబర్ వల్ల ఉపయోగాలు ఏంటి?

ప్రయాణికుల వివరాల భద్రత: మీ పేరు, వయస్సు, లింగం, ఫోన్ నంబర్, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వివరాలు ఈ నంబర్‌తో అనుసంధానించి ఉంటాయి.

ఇవి కూడా చదవండి



ప్రయాణ సమగ్ర సమాచారం:

మీరు ఎక్కాల్సిన రైలు సంఖ్య, ప్రయాణించే తేదీ, బయలుదేరే స్టేషన్, గమ్యస్థానం (Destination), క్లాస్ (1AC, 2AC, 3AC, Sleeper) వంటి వివరాలు దీని ద్వారా సులభంగా తెలుస్తాయి.

కోచ్ మరియు సీటు వివరాలు:

టికెట్ బుకింగ్ లేదా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు కేటాయించిన కోచ్ నంబర్ (ఉదాహరణకు S1, B2), బెర్త్/సీటు నంబర్ (Lower, Upper, Side Lower) తెలుసుకోవడానికి PNR సాయపడుతుంది.

లైవ్ స్టేటస్ ట్రాకింగ్:

మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా (CNF), వెయిటింగ్ లిస్ట్‌లో ఉందా (WL) లేక RACలో ఉందా అని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేయడానికి ఈ నంబర్ తప్పనిసరి.

PNR నంబర్ ఎలా పనిచేస్తుంది?

(ఆ 10 అంకెల ప్రత్యేకత) రైల్వే వ్యవస్థలో కేటాయించే 10 అంకెలు యాదృచ్ఛికంగా (Random) వచ్చేవి కావు.

  • మొదటి 3 అంకెలు: టికెట్ ఏ రైల్వే జోన్ లేదా రిజర్వేషన్ జోన్ (Zone/PRS) నుండి బుక్ అయిందో సూచిస్తాయి.
  • మిగిలిన 7 అంకెలు: ప్రయాణికుని వివరాలను, టికెట్ యూనిక్‌నెస్‌ను సూచించడానికి సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడతాయి.

గమనిక: మీ PNR నంబర్ ద్వారానే ప్యాసింజర్ చార్ట్ రూపొందిస్తారు. ప్రయాణం ముగిసిన కొన్ని రోజుల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ డేటా సిస్టమ్ నుండి తొలగిపోతుంది. టికెట్ స్థితిని తెలుసుకోవడమే కాకుండా ప్రయాణ సమయంలో ఏవైనా సమస్యలు వచ్చినా, రీఫండ్ ప్రాసెస్ చేయాలన్నా ఈ PNR సంఖ్య కీలకంగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: Gautam Adani: గౌతమ్ అదానీ 20 ఏళ్లకే కోటీశ్వరుడు ఎలా అయ్యారు? ఇంత ఎదగడానికి కారణం ఆ వ్యాపారమే..!

ఇది కూడా చదవండి: Lemon Tree: నిమ్మ చెట్టుకు కాయలు కాయడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *