Headlines

Indian Railways: 604 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 19 గంటల్లోనే.. పూర్తి వివరాలివే!


Indian Railways: భారత్, నేపాల్ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా రామాయణంతో అనుబంధం ఉన్న రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, నేపాల్‌లోని జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ భారతీయ రైల్వే కొత్తగా ‘సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రారంభించింది. నవంబర్ 23, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు.

ఈ రైలు అందుబాటులోకి రావడంతో అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలం నుంచి నేపాల్‌లోని సీతమ్మ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన జనక్‌పూర్ ధామ్ వరకు ప్రయాణించడం మరింత సులభం కానుంది. ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

604 కిలోమీటర్లు.. 19 గంటల ప్రయాణం

అయోధ్య నుంచి జనక్‌పూర్ ధామ్ వరకు ఈ రైలు సుమారు 604 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి దాదాపు 19 గంటల సమయం పడుతుంది. ఇప్పటివరకు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించాలనుకునే వారు మార్గమధ్యంలో రైళ్లు మార్చుకోవాల్సి వచ్చేది. అయితే కొత్త రైలు సేవతో నేరుగా ప్రయాణించే అవకాశం లభించనుంది. ఈ రైలు ప్రారంభ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా వర్చువల్‌గా నిర్వహించారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

నవంబర్ 28 నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి

నవంబర్ 23న ప్రారంభించిన ఈ రైలు సేవను సాధారణ ప్రయాణికుల కోసం నవంబర్ 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే రెండు దిశల్లో నడుస్తుంది.

  • అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు: ప్రతి సోమవారం.
  • జనక్‌పూర్ నుంచి అయోధ్యకు: ప్రతి శనివారం.

రైలు బయలుదేరే సమయాలు ఇవే!

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు:

  • రైలు నంబర్: 15596
  • బయలుదేరే సమయం: సోమవారం సాయంత్రం 5:50 గంటలకు.
  • జనక్‌పూర్ చేరుకునే సమయం: మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు (నేపాల్ స్థానిక సమయం).

జనక్‌పూర్ నుంచి అయోధ్యకు:

  • రైలు నంబర్: 15595
  • బయలుదేరే సమయం: శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు (నేపాల్ స్థానిక సమయం).
  • అయోధ్య చేరుకునే సమయం: ఆదివారం ఉదయం 8:10 గంటలకు.

మార్గమధ్యంలో 10 స్టేషన్లలో ఆగుతుంది

ఈ రైలు ప్రయాణంలో మొత్తం 10 ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. అవి:

1. జయ్‌నగర్

2. మధుబని

3. షిషో

4. సీతామఢి

5. రక్సౌల్

6. నర్కటియాగంజ్

7. గోరఖ్‌పూర్

8. బస్తీ

9. మనకాపూర్

10. అయోధ్య ధామ్

ఈ మార్గం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతో పాటు నేపాల్‌ను కలుపుతుంది

రైలులో ఎన్ని కోచ్‌లు ఉంటాయి?

సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 17 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 8 ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లు, మిగిలినవి లగేజీ, విద్యుత్ సరఫరా వంటి అవసరాల కోసం కేటాయించిన కోచ్‌లు ఉంటాయి. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు సుదూర ప్రయాణం చేసే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

ఈ కొత్త రైలు సేవ కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాదు. అయోధ్య శ్రీరాముడితో, జనక్‌పూర్ సీతమ్మవారితో ముడిపడి ఉన్న ప్రాంతాలు కావడంతో రామాయణ సంప్రదాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. భారత్, నేపాల్ మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడేందుకు కూడా ఈ రైలు ఉపయోగపడనుంది. మొత్తంగా చెప్పాలంటే.. అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు నేరుగా రైలు ప్రయాణం అందుబాటులోకి రావడం భక్తులకు, పర్యాటకులకు మంచి అవకాశమనే చెప్పాలి. ముఖ్యంగా రామాయణంతో అనుబంధం ఉన్న రెండు పవిత్ర ప్రాంతాలను ఒకే రైలు ద్వారా సందర్శించే అవకాశం కలగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *