హారారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో ఎదురైన ఘోర ఓటములకు ప్రతీకారం అన్నట్లు సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో యంగ్ బౌలర్లు మయాంక్ యాదవ్, డెబ్యూ బౌలర్ అశోక్ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
Peak Hindi commentary 🔊
Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/Ny0ndTdy3W
— FanCode (@FanCode) July 23, 2026
దీంతో టీమిండియా యంగ్ బౌలర్ల దెబ్బకు జింబాబ్వే బౌలర్లు అతలాకుతలం అవుతున్నారు. కేవలం 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ గోల్డెన్ డక్ అవ్వగా, మరో ఓపెనర్ బెన్ కరన్ 10, వన్ డౌన్లో వచ్చిన డియోన్ మేయర్స్ 6, కెప్టెన్ సికందర్ రజా 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. మొత్తంగా భారత బౌలింగ్ ఎటాక్ ముందు జింబాబ్వే గౌరవ ప్రదమైన స్కోర్ కోసం పోరాడుతోంది.
A RIPPER FROM MAYANK YADAV 🥶
– Terrific review by Ishan Kishan! pic.twitter.com/YgA7LtsSVR
— Johns. (@CricCrazyJohns) July 23, 2026
ఇప్పటి వరకు భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబే చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అశోక్ శర్మ 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి డీసెంట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే అతనికి ఇంకా వికెట్ దక్కలేదు. మిగిలి ఉన్న చివరి ఓవర్లో వికెట్ సాధిస్తాడేమో చూడాలి. మొత్తంగా టీమిండియా జింబాబ్వే టూర్‌ను మంచిగానే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు.
BACK TO BACK WICKETS IN BACK TO BACK OVERS! 💪
Full THOKO mode power-play mein 🔥
Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #RokoNahiThoko pic.twitter.com/6vpRLxPZ5I
— FanCode (@FanCode) July 23, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి