అయితే, ఐదవ వన్డేకు ముందు భారత బ్యాటర్లకు కొంత ఊరట లభించింది. నాలుగో వన్డేలో టీం ఇండియా టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసి, భారత అభిమానులకు నిరాశను మిగిల్చిన మ్యాట్ హెన్రీ ఐదవ వన్డేకు దూరమయ్యాడు. చివరి వన్డే మ్యాచ్ కోసం న్యూజిలాండ్ ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఎందుకంటే, టీం ఇండియాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు అతనికి విశ్రాంతినిచ్చినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నిర్ణయం భారత బ్యాటర్లకు భారీ ఊరటనిచ్చే అంశంగా పరిగణించబడుతోంది. నాలుగో వన్డేలో హెన్రీ సృష్టించిన విధ్వంసం తర్వాత, ఐదవ వన్డేలో అతడు లేకపోవడం భారత్‌కు కచ్చితంగా కలిసొచ్చే అంశం.