Headlines

IND vs NZ 2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. భారీ స్కోర్ దిశగా కివీస్.. చెమటోడ్చిన భారత బౌలర్లు..!


IND vs NZ 2nd Test: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకోగా.. కివీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతూ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

హాఫ్ సెంచరీలతో రాణించిన లాథమ్, బ్లండెల్..

న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ 128 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 79 బంతుల్లో 31 పరుగులు చేశాడు. హెన్రీ నికోల్స్ 16 పరుగులు చేయగా, రచిన్ రవీంద్ర డకౌట్‌గా వెనుదిరిగాడు.

డారిల్ మిచెల్ 74 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ అజేయంగా 53 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 246/5కు చేరింది.

భారత బౌలర్ల ప్రదర్శన..

భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్, గర్నూర్ బ్రార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ సాధించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 19 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు.

బ్యాటర్ పరుగులు
టామ్ లాథమ్ 59
డెవాన్ కాన్వే 31
హెన్రీ నికోల్స్ 16
రచిన్ రవీంద్ర 0
డారిల్ మిచెల్ 31
టామ్ బ్లండెల్ 53*
గ్లెన్ ఫిలిప్స్ 36*

భారత బౌలింగ్ గణాంకాలు..

బౌలర్ ఓవర్లు పరుగులు వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా 19 37 0
అన్షుల్ కాంబోజ్ 17 56 1
ఆకాష్ దీప్ 21 52 2
గర్నూర్ బ్రార్ 19 52 1
వాషింగ్టన్ సుందర్ 9 36 1

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *