Headlines

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు!


Double Decker Buses: హైదరాబాద్‌ నగర పర్యాటకులకు, ప్రజలకు త్వరలోనే ఓ కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. భాగ్యనగరాన్ని సందర్శించేందుకు వీలుగా ఓపెన్ ట్యాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) రెడీ అవుతోంది.

బస్సుల ప్రత్యేకతలు:

డిజైన్ విషయానికొస్తే.. పై అంతస్తు (అప్పర్ డెక్) పూర్తిగా తెరిచి (ఓపెన్ టాప్) ఉంటుంది. దీని ద్వారా నగర అందాలను నేరుగా తిలకించవచ్చు. కింది అంతస్తు (లోయర్ డెక్) పూర్తిగా ఏసీ (AC) సౌకర్యంతో ఉంటుంది. ఇక వసతుల విషయానికొస్తే.. మైక్రోఫోన్‌తో కూడిన గైడ్ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, యూఎస్‌బీ (USB) ఛార్జింగ్ పాయింట్లు, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ (LED) లైటింగ్ కలిగి ఉంటాయి. కొత్తగా రెండు ఎలక్ట్రిక్ ఓపెన్-టాప్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు TGTDC ఇటీవల ప్రతిపాదనలు (RFP) ఆహ్వానించింది.

ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) వద్ద ఉన్న 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కూడా పర్యాటక శాఖకు బదిలీ చేయాలని లెటర్ రాశారు. దీనికి HMDA అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ప్రస్తుతం ఈ బస్సులు నెక్లెస్ రోడ్, వేవ్ రాక్, హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, గోల్కొండ వంటి పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి.

నిజాం కాలం:

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల చరిత్ర మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభమైంది. 1946లో ఇంగ్లాండ్ నుంచి 30 ఆల్బియాన్ CX 19 మోడల్ బస్సులను తెప్పించి, హైదరాబాద్ ఆల్విన్ సంస్థలో అసెంబుల్ చేశారు. అయితే నిర్వహణ ఖర్చులు, విడిభాగాల (స్పేర్ పార్ట్స్) కొరత కారణంగా 2003 నాటికి ఈ డబుల్ డెక్కర్ బస్సులను పూర్తిగా నిలిపివేశారు.

తిరిగి పునఃప్రారంభం:

2023 ఫిబ్రవరిలో జరిగిన ‘హైదరాబాద్ ఇ-ప్రిక్స్’ ఫార్ములా-ఇ రేస్ సందర్భంగా రూ. 12 కోట్ల వ్యయంతో HMDA 6 ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు ధర రూ. 2 కోట్లు కాగా, ఇవి సింగిల్ ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

ఇది కూడా చదవండి: LPG: దేశంలో మళ్లీ గ్యాస్‌ సిలిండర్ల కొరత అంటూ పుకార్లు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *