Headlines

అందుకే ఓడిపోయే మ్యాచ్ గెలిచాం.. మా వాళ్లతో కెప్టెన్సీ నరకమే: శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..!


India vs Japan T20I: సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం నమోదు చేసింది. మైదానం తడిగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ డెకౌట్ కాగా, సంజు శామ్సన్ 9, ఇషాన్ కిషన్ 3 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలకమైన 16 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో జపాన్ 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ విజయం భారత్‌కు టీ20 క్రికెట్‌లో 200వది కావడం విశేషం. ఈ హిస్టారికల్ విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ మ్యాచ్ 5 ఓవర్లకు కుదించినప్పటికీ ఇరు జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అయ్యర్ అన్నాడు. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఎక్కువమంది చదివనది: 5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర!

ఇవి కూడా చదవండి



జపాన్‌కు చేరుకోవడానికి తమకు దాదాపు 3 గంటల సమయం పట్టినా, మైదానంలోకి అడుగుపెట్టి అభిమానులను అల్లరించాలనే ఆలోచనే తమ మనసులో ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. చారిత్రాత్మక ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, ఈ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇది కేవలం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినప్పటికీ మైదానంలో బరిలోకి దిగినందుకు ఆనందంగా ఉందని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు తమకు గట్టి పోటీని ఇచ్చిందని, వాళ్లు అద్భుతంగా ఆడారని అయ్యర్ ప్రశంసించాడు.

వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు నాయకత్వం వహించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఒత్తిడి ఉన్నప్పుడే తన అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని, ఒత్తిడి అనేది తనలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీస్తుందని అయ్యర్ వెల్లడించాడు. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌లో జపాన్ జట్టు చాలా గట్టి పోటీని ఇచ్చిందని, వారి స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని అయ్యర్ మెచ్చుకున్నాడు. అలాగే, ఈ కొత్త మైదానంలో భారత బౌలర్లకు, బ్యాటర్లకు మంచి అనుభవం లభించిందని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఎక్కువమంది చదివనది: Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలవడమే తమ లక్ష్యమని అయ్యర్ స్పష్టం చేశాడు. మొదట తాము మ్యాచ్‌లు జరిగే నగోయాకి వెళ్లి అక్కడ పరిస్థితులను అంచనా వేసి పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకుంటామని అన్నాడు. ఇతర జట్లు కూడా ఇదే లక్ష్యంతో వస్తాయని తనకు తెలుసునని, కానీ తమ ప్రణాళికలకు తగ్గట్లుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. గతంలో ఏం జరిగిందో లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆలోచించకూడదని, ఎంత ఎక్కువగా వర్తమానంపై దృష్టి పెడితే అంత మంచిదని శ్రేయస్ అయ్యర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *