Headlines

Hyderabad: హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స.. మహిళ కడుపులో నుంచి 11.2 కిలోల భారీ కణతి తొలగింపు!


Hyderabad: హైదరాబాద్‌లో ఓ మహిళ కడుపులో నుంచి ఏకంగా 11 కిలోల 200 గ్రాముల భారీ కణతిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. పాతబస్తీ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళితే.. పేషెంట్‌ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల అనీస్ ఫాతిమా అనే మహిళా కొంతకాలంగా కడుపులో గడ్డతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రతరం కావడంతో సెప్టెంబర్ 10న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించారు.

అయితే పేషెంట్‌ను పరీక్షించిన వైద్యులు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కడుపులో భారీ పరిమాణంలో కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేయాలని ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. సదరు ఆస్పత్రి వైద్యురాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్‌లో 11 కిలోల 200 గ్రాముల బరువున్న కణతిని విజయవంతంగా తొలగించారు. ఇంత భారీ పరిమాణంలో కణతి తొలగించడం అరుదైన ఘటనగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఆపరేషన్లు చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10 కిలోల బరువున్న కణతిని తొలగించిన ఘటన రికార్డుగా ఉందని వైద్యురాలు తెలిపారు. తాజాగా 11 కిలోల 200 గ్రాముల కణతిని తొలగించడం ద్వారా మరో అరుదైన కేసుగా నిలిచిందని పేర్కొన్నారు.

శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం వల్ల సమస్యను గుర్తించి చికిత్స అందించగలిగామని వైద్యులు తెలిపారు.

తక్కువ ఖర్చుతో వైద్యం..

మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు తమ ఆసుపత్రి ద్వారా కృషి చేస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ఖరీదైన వైద్యం కారణంగా ఎవరూ చికిత్సకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో సేవలు అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *