Headlines

Hyderabad: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం


Hyderabad: జీడిమెట్లలో షార్ట్‌ సర్క్యూట్.. క్షణాల్లో ఐదు బస్సులు దగ్ధం

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట బొడ్రాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ గ్యారేజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న బస్సులకు మంటలు వ్యాపించడంతో మొత్తం ఐదు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

గ్యారేజ్‌లో మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. అదే ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు, బంక్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే గ్యారేజ్‌లో ఉన్న ఐదు బస్సులు పూర్తిగా కాలిపోయాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్యారేజ్ సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులన్నీ పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ.. నష్టం విలువ ఎంత ఉంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *