Headlines

Hyderabad: అండాల సేకరణ కేసులో బిగ్ ట్విస్ట్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు.. అసలు విషయం గుట్టురట్టు..


అండాల సేకరణ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అండాల సేకరణ పేరుతో మహిళల అక్రమ రవాణా జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక పక్కా ప్లాన్డ్ నెట్‌వర్క్‌ ఉన్నట్లు అనుమానిస్తున్న మల్కాజిగిరి పోలీసులు.. అక్రమ ART (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) రిఫరల్ వ్యవస్థపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A-9 నిందితుడిగా ఉన్న ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ పాత్ర కీలకంగా మారింది. అండాల సేకరణ కోసం మహిళలను ART బ్యాంకులు, ఫర్టిలిటీ కేంద్రాలకు రిఫర్ చేసినట్లు దుర్గాప్రసాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ రిఫరల్స్ వెనుక ఎలాంటి ఒప్పందాలు జరిగాయి? మహిళలను ఏయే కేంద్రాలకు పంపించారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా మల్కాజిగిరి పోలీసులు బేగంపేటలోని ఓ ఐవీఎఫ్‌ (IVF) కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ART బ్యాంకుల రికార్డులు, ఫర్టిలిటీ సేవలకు సంబంధించిన కీలక పత్రాలను కూడా పోలీసులు సీజ్‌ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక పక్కా నెట్‌వర్క్‌ ద్వారా మహిళలను వివిధ ART బ్యాంకులు, ఫర్టిలిటీ కేంద్రాలకు పంపిస్తూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాప్రసాద్‌ ఆర్థిక లావాదేవీలతో పాటు రిఫరల్‌ నెట్‌వర్క్‌ కార్యకలాపాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ నెట్‌వర్క్‌లో ఐవీఎఫ్‌ కేంద్రాల డైరెక్టర్ల పాత్ర ఏమిటన్న దానిపైనా పోలీసులు దృష్టి సారించారు. మహిళల అండాల సేకరణకు సంబంధించిన ప్రక్రియలు నిబంధనల ప్రకారమే జరిగాయా? రిఫరల్స్‌ వెనుక అక్రమ ఒప్పందాలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ పరికరాలు, రికార్డుల ఫోరెన్సిక్‌ విశ్లేషణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మహిళల అండాల సేకరణ పేరుతో సాగినట్లు అనుమానిస్తున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఆర్థిక లావాదేవీల్లో ఎవరికి వాటా ఉంది? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *