హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రచండంగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. నిత్యం ఉదయం 9 గంటలు దాటిటే జనాలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. దాదాను అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 28 ) రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను బద్దలుకొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాల్లోని సుమారు 39 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.
నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది. సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా నమోదైంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ సాత్నాలలో 45.6 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి బాన్సువాడలో 45.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఏప్రిల్ 26న అత్యధికంగా 48.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా ఏప్రిల్ 28న 46 డిగ్రీలు నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ జారీ చేసింది. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లవల్సి వస్తే తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.