ఇక 2026లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందని బాబా వంగా తన జోస్యం చెప్పారు. దీని కారణంగా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా వీటి రేట్లు పెరుగుతాయని అంచనా వేశారు. దీంతో ఆమె చెప్పిన జోస్యం నిజమయ్యే రోజు త్వరలోనే ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడైనా యుద్దాలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లను పక్కన పెట్టి గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు మళ్లిస్తారు. దీని వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇవి నేరుగా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదు.
2026కి సంబంధించి బంగారం ధరలపై బాబా వంగా అంచనాలు ఇప్పుడు షాకింగ్‌గా మారాయి. బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయని ఆమె జోస్యం చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ.1.55 లక్షల వద్ద తులం బంగారం ట్రేడవుతోండగా.. ఈ ఏడాది యుద్ద పరిస్థితుల వల్ల రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారుతుంది.
2026లో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకోవచ్చని బాగా వంగా అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ద మేఘాల క్రమంలో ఆమె జోస్యం నిజమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం, వెండిని నిల్వ చేసుకుంటున్నాయి. ఇక వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో డిమాండ్ కారణంగా ధరలు పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత రెండేళ్ల నుంచి బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ధరలు తగ్గుతాయని కొంతమంది చెబుతుండగా.. రికార్డు స్థాయిలో పెరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాగా వంగా బంగారం, వెండి ధరలపై చెప్పిన అంచనాలు సంచలనంగా మారాయి.




