మడత కాజా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు మైదా, చిటికెడు ఉప్పు, నెయ్యి, వంట సోడా, నిమ్మరసం ఒక టీ స్పూన్, యాలకుల పొడి, చక్కెర, ఫ్రైకి సరిపడ నూనె. తయారీ విధానం : మడత కాజా అచ్చం కాకినాడ స్టైల్‌లో రావాలి అంటే తప్పకుండా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పిండి కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కొలతలు తీసుకున్నప్పుడే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని కోసం మందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా, మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి.