Headlines

Glowing skin: ఎండవల్ల ముఖం నల్లగా మారిందా.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో మెరిపించండి!

Glowing skin: ఎండవల్ల ముఖం నల్లగా మారిందా.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో మెరిపించండి!


వేసవి కాలంలో మీ చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. తీవ్రమైన ఎండ, చెమట, దుమ్ము మీ ముఖాన్ని త్వరగా నల్లబడేలా, అలసటగా కనిపించేలా చేస్తాయి. అయితే మీరు ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడకుండా కేవలం మీ కిచెన్‌లో దొరికే కొన్ని పదార్థాలతోనే మీ చర్మాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. అలాంటి వాటిలో దోసకాయ వాటిలో ఒకటి. దీనిలోని ఉండే పోషకాలు, నీటి శాతం మీ చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కాబట్టి దొసకాయ రసంతో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకొని వాటిని ముఖాన్ని రాసుకుంటే మీ అందం రెట్టింపు కావడంతో పాటు చర్మ నిగారింపు కూడా పెగరుతుంది.

దోసకాయ ఐస్ క్యూబ్స్‌ను ఎలా తయారు చేయాలి?

దోసకాయ ఐస్ క్యూబ్స్ తయారు చేయడం చాలా సులభం ఇందుకోసం ముందుగా ఒక తాజా దోసకాయను తీసుకుని నీటితో బాగా కడగాలి. తర్వాత దోసకాయను చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ రసాన్ని వడకట్టుకోవాలి. ఈ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి, ఫ్రీజర్‌లో కొన్ని గంటల పాటు ఉంచాలి.

ఎలా ఉపయోగించాలి?

ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ముఖంపై వృత్తాకారంలో మెల్లగా మసాజ్ చేయాలి. నేరుగా చర్మంపై ఐస్ పెట్టడం ఇబ్బందిగా ఉంటే, ఒక పల్చని కాటన్ బట్టలో చుట్టి కూడా మసాజ్ చేయవచ్చు. ఇలా వారంలో రెండు మూజు రోజులు చేయడం వల్ల మీ ముఖం సహజంగా మెరవడమే కాకుండా మీ చర్యం ఆరోగ్యంగా ఉంటుంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు

ఈ ఐస్ క్యూబ్స్‌ను ఫ్రిజ్‌లో 5-6 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు వీటిని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదా నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *