Headlines

Gas Cylinder: 5 కేజీల సిలిండర్‌పై కేంద్రం మరో సడెన్ డెసిషన్.. గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట..

Gas Cylinder: 5 కేజీల సిలిండర్‌పై కేంద్రం మరో సడెన్ డెసిషన్.. గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట..


Gas Cylinder: 5 కేజీల సిలిండర్‌పై కేంద్రం మరో సడెన్ డెసిషన్.. గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం క్రమంలో గ్యాస్ సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడ్డ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఆయిల్ ఎగుమతులపై దీని ప్రభావం పడుతోంది. గ్యాస్, ఇంధనాన్ని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే భారత్‌ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడంతో ప్రజలు అవస్థలు పడుతుండగా.. ఇప్పటికే పరిస్థితి అలాగే ఉంది. ఈ క్రమంలో కేంద్రం గ్యాస్ ఉత్పత్తిని, సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడుతుండగా.. ఇందులో భాగంగా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. గ్యాస్ కొరతను తగ్గించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ కంపెనీలు 5 కేజీల సిలిండర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటికి ప్రజల నుంచి అద్బుత స్పందన రావడంతో కేంద్రం మరో డెషిషన్ తీసుకుంది. వీటి సరఫరా మరింతగా పెంచాలని నిర్ణయించింది.

పెరిగిన విక్రయాల సంఖ్య

దేశంలో 5 కేజీల చిన్న సిలిండర్ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి 23 నుంచి 13 లక్షలకుపైగా వీటి అమ్మకాలు జరిగాయి. రోజు లక్షకుపైగా విక్రయాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ కొరత క్రమంలో 5 కేజీల సిలిండర్లను కేంద్రం తీసుకొచ్చింది. ఇది తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంకులకు నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. ఏదైనా ఒక ధృవీకరణ పత్రం సమర్పిస్తే వెంటనే సిలిండర్ ఇచ్చేస్తారు. ఇక గ్యాస్ అయిపోగానే.. కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల్లోకి వెళ్లి సులువుగా రీఫిల్లింగ్ చేసుకోవచ్చు. వలస కార్మికులు, రూముల్లో ఉండే విద్యార్థులకు ఈ గ్యాస్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ ధరకే ఈ సిలిండర్ లభిస్తోంది.

పీఎన్‌జీ గ్యాస్ పెంపు

ఇక దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)ను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా 4 లక్షల మంది పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకున్నారు. మార్చి నుంచి 4,24,000 పీఎన్‌జీ కనెక్షన్లను మంజూరు చేశారు. ఇక 30 వేల మంది తమ ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేసి పీఎన్‌జీలోకి మారారు. దేశంలో ఇప్పటికీ కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది. దీంతో రెస్టారెంట్స్, హోటళ్ల యజమానులు ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా రూ.2 వేలు ఉండే ఈ గ్యాస్ సిలిండర్ ధర బ్లాక్ మార్కె్ట్లో రూ.6 వేల వరకు పలుకుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్ కొరత క్రమంలో వ్యాపారులు ధరలను పెంచేయడంతో కస్టమర్ల జేబుకు చిల్లులు తప్పడ లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *