Headlines

FASTag New Rule: మీరు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు

FASTag New Rule: మీరు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు


FASTag New Rule: ఫాస్టాగ్ వాడకానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. దీనిని పాటించకపోతే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ చేయబడే అవకాశం ఉంది. మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొంతకాలంగా ఫాస్టాగ్ నిబంధనలను నిరంతరం సవరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఫాస్టాగ్‌ను ఉపయోగించకపోతే దానిని బ్లాక్‌లిస్ట్ చేయవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

  1. ఖచ్చితంగా అతికించాలి: వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనం ముందు వైపు ఉండే అద్దం (Windscreen) పై లోపలి వైపు నుండి ఖచ్చితంగా అతికించాలి.
  2. అతికించకపోతే జరిమానా: ఒకవేళ మీ వద్ద యాక్టివ్‌గా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ, దానిని అద్దంపై అతికించకుండా చేతితో చూపించినా లేదా లోపల ఎక్కడో పెట్టుకున్నా.. అటువంటి వాహనాలను ‘బ్లాక్ లిస్ట్’ చేసినట్లుగా పరిగణిస్తారు.
  3. రెట్టింపు ఛార్జీ: అద్దంపై ట్యాగ్ లేని వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఉన్న రూల్స్ ప్రకారం రెట్టింపు (Double) టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎందుకు ఈ నిర్ణయం?:

టోల్ ప్లాజాల వద్ద స్కాన్ చేసేటప్పుడు సమయం వృధా కాకుండా ఉండటానికి, అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటానికి NHAI ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

CCTV నిఘా: టోల్ బూత్‌ల వద్ద ఉండే కెమెరాలు అద్దంపై ట్యాగ్ లేని వాహనాలను రికార్డ్ చేస్తాయి. తద్వారా సిబ్బందితో వాగ్వాదానికి దిగినా ఉపయోగం ఉండదు. అందుకే వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ను సరైన పద్ధతిలో విండ్‌స్క్రీన్‌పై అతికించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నగదు పరిమితులు

  • ఏప్రిల్ 2026 నుండి దేశవ్యాప్తంగా NHAI నిర్వహించే రహదారులపై నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించారు. టోల్ చెల్లింపుల కోసం FASTag లేదా UPIని ఉపయోగించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ మీ ఫాస్టాగ్ చెల్లుబాటులో లేకపోతే, UPI ద్వారా చెల్లింపు చేసేటప్పుడు 25% అదనపు పన్ను విధించనున్నారు.
  • గుర్తింపు కార్డు ద్వారా టోల్ మినహాయింపును అరికట్టారు.
  • తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టారు. ప్రైవేట్ కార్లకు సంవత్సరానికి రూ.3,075 రుసుము ఉంటుంది. ఇది 200 ప్రయాణాలకు వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *