Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.6000.. రైతుల కోసం దరఖాస్తులు షురూ.. ఇలా చేసుకోండి..!

Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో రూ.6000.. రైతుల కోసం దరఖాస్తులు షురూ.. ఇలా చేసుకోండి..!


Farmers: దేశంలోని కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM-Kisan) పథకం అద్భుతంగా అమలవుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. తాజాగా ఈ పథకంలో కొత్తగా లబ్ధిదారులను చేర్చుకునే ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కొత్తగా 10 లక్షల మందికి పైగా చేరిక

గతంలో అనర్హులైన కోటి మందికి పైగా రైతులను జాబితా నుండి తొలగించిన కేంద్రం, ఇప్పుడు అర్హులైన కొత్త రైతులకు తలుపులు తెరిచింది.

  • 21వ విడతలో: 9.35 కోట్ల మంది లబ్ధి పొందారు.
  • 22వ విడతలో: ఈ సంఖ్య 9.45 కోట్లకు పెరిగింది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా సుమారు 10.35 లక్షల మంది కొత్త రైతులు ఈ పథకంలో చేరారు. 23వ విడతలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

23వ విడత ఎప్పుడు?

మార్చి 13న 22వ విడత నిధులను విడుదల చేసిన కేంద్రం.. తదుపరి 23వ విడతను జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మే, జూన్ నెలల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులకు ఇది సరైన సమయం. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జూలై నుండి రెగ్యులర్‌గా నగదు పొందే వీలుంటుంది. ముఖ్యంగా ఏపీ రైతులకు పీఎం కిసాన్‌తో పాటు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా అదనపు ప్రయోజనం కూడా చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు!

1.పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోండిలా:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు లేదు. రైతులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్ విధానం: అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించండి.
  • హోమ్ పేజీలో ‘Farmers Corner’ లో ఉన్న ‘New Farmer Registration’ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి, రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • మొబైల్ కు వచ్చే OTP ని ఎంటర్ చేసి, ఫారమ్‌ను పూర్తి చేయండి.
  • మీ బ్యాంక్ ఖాతా మరియు భూమి రికార్డుల వివరాలను (సర్వే నంబర్, ఖాతా నంబర్) జాగ్రత్తగా పొందుపరిచి సబ్మిట్ చేయండి.

2. ఆఫ్‌లైన్ విధానం (మీ-సేవా కేంద్రం):

మీరు నేరుగా మీ సమీపంలోని మీ-సేవా లేదా CSC సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ సుమారు రూ.50 ఛార్జీతో మీ వివరాలను నమోదు చేస్తారు. మీ ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ వివరాలను తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ సిబ్బంది మీ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేస్తారు.

దరఖాస్తు స్థితి (Status) తెలుసుకోవడం ఎలా?

మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ పేరు జాబితాలో చేరిందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి:

  • వెబ్‌సైట్‌లోని ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  • అక్కడ ‘Beneficiary Status’ అని కనిపిస్తే మీ పేరు ఆమోదం పొందినట్లు అర్థం. ఒకవేళ ‘Under Process’ అని ఉంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. సాధారణంగా రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *