Headlines

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే సులువుగా..


ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేషన్, బ్యాలెన్స్ చెకింగ్, ఇతర సేవల కోసం పీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోనే ఉమాంగ్ యాప్‌ ద్వారా డిజిటల్ సేవలన్నీ పొందవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ సర్వీసులను మరింత విస్తరిస్తోంది. కొన్ని ముఖ్యమైన పీఎఫ్ ఆన్‌లైన్ సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందేలా నూతన మార్పులు చేసింది. ఇటీవల ఈపీఎఫ్‌వో డిజిటల్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపట్టింది. మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు పొందేందుకు ఈ చర్యలు చేపట్టింది. దీంతో పాటు యూఏఎన్ యాక్టివేషన్ విషయంలో కీలక మార్పులు చేసింది. యూఏఎన్ యాక్టివేషన్ సేవలను కేవలం ఉమాంగ్ యాప్‌లో మాత్రమే చేసుకునేలా మార్పులు చేసింది. పీఎఫ్ పోర్టల్ నుంచి సేవలను పూర్తిగా తొలగించింది. ఇకపై ఉద్యోగులు తమ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే చేసుకునేందుకు వీలుంది. ఇప్పటికే యూఏఎన్ నెంబర్ ఉండి యాక్టివేషన్ చేసుకోని ఉద్యోగులతో పాటు కొత్తగా చేరే ఉద్యోగులు కూడా ఉమాంగ్ యాప్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఆధారిత ఫేస్ అధెంటికేషన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక యూఏఎన్ లేని ఉద్యోగులు ఉమాంగ్ యాప్ ద్వారా నెంబర్ పొందవచ్చు.

కొత్త యూఏఎన్ ఎలా పొందాలి..?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

-ఆ తర్వాత ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి

-సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయాలి

-ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి

-యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి

-మీ ఆధార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి

-ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి

-అనంతరం మీ ఫేస్ స్కాన్ చేయాలి

-వెరిఫికేషన్ పూర్తయ్యాక యూఏఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది

-మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో యూఏఎన్ నెంబర్ అందుతుంది

ఇప్పటికే యూఏఎన్ నెంబర్ ఉంటే..

ఇప్పటికే యూఏఎన్ నెంబర్ ఉంటే.. యూఏఎన్ యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ చేయాలి. అనంతరం యూఏఎన్ యాక్టివేషన్ పూర్తవుతుంది. యూఏఎన్ యాక్టివేషన్ పూర్తయితే మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్, పాస్ బుక్ సేవలను పొందవచ్చు. అలాగే క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *