EPFO ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఫారం 121 కలిగే ప్రయోజనలు ఇవే!

EPFO ఖాతాదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఫారం 121 కలిగే ప్రయోజనలు ఇవే!


ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును ప్రకటించింది. EPFO ప్రకారం.. పాత ఫారమ్‌లు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121ను ప్రవేశపెట్టనుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు 60 సంవత్సరాల లోపు వారు ఫారం 15G, సీనియర్ సిటిజన్లు ఫారం 15H సమర్పించేవారు. అయితే ఇకపై ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారం 121ను ఉపయోగించాల్సి ఉంటుంది. పన్ను బాధ్యత సున్నాగా ఉన్నవారు, అంటే తమ ఆదాయం పన్ను పరిమితికి దిగువన ఉన్నవారు, టీడీఎస్ (TDS) కోతలను నివారించేందుకు ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది.

ఫారం 121ను భారతదేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF), ఇతర అర్హులైన వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. అయితే కంపెనీలు, సంస్థలు, అలాగే ఎన్నారైలకు ఈ ఫారం వర్తించదు. మొత్తం అంచనా ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోవడం ఈ ఫారం సమర్పించడానికి ప్రధాన షరతుగా ఉంటుంది. ఫారం 121 ఒక స్వీయ-ప్రకటన పత్రంగా పనిచేస్తుంది. దీన్ని EPFO, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలకు సమర్పించినట్లయితే, టీడీఎస్ కోతలు జరగవు. ప్రతి ఫారానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) కూడా ఇవ్వబడుతుంది. ఈ సంఖ్యలో క్రమ సంఖ్య, పన్ను సంవత్సరం, TAN వంటి వివరాలు ఉంటాయి.

ఇక పాత ఫారమ్‌ల విషయానికి వస్తే ఏప్రిల్ 1 తర్వాత కూడా 15G లేదా 15H సమర్పించినా అవి వెంటనే తిరస్కరించబడవు. అయితే తర్వాత ఫారం 121 సమర్పించాలని కోరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొత్త ఫారం 121ను మరింత సులభతరం చేసే విధంగా రూపకల్పన చేశారు. ఇందులో ఆటో-ఫిల్ సమాచారం, రియల్-టైమ్ ఎర్రర్ చెక్, డ్రాప్‌డౌన్ ఎంపికలు, సులభమైన ధృవీకరణ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఫైలింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పొరపాట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *