Headlines

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు


భూమి మరోసారి పెను విపత్తు అంచున నిలిచింది. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ అత్యంత శక్తివంతంగా మారనుందని, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగడం దాదాపు ఖాయమని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు తప్పవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి ఎల్ నినో తన గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే దీని తీవ్ర ప్రభావాలు, పరిణామాలు మాత్రం 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షపాత సరళి పూర్తిగా మారిపోనుంది. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు, మరోవైపు తీవ్రమైన కరువు కాటకాలు, అసాధారణ వేడిగాలులు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మానవ తప్పిదాల వల్ల భూమి ఇప్పటికే తీవ్రంగా వేడెక్కుతోంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాలను విచక్షణారహితంగా మండించడం వల్ల వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ వేడికి ఎల్ నినో తోడవడంతో వాతావరణ వైపరీత్యాలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “మన కళ్ల ముందే ఎల్ నినో అతిపెద్ద రూపం దాల్చుతోంది. భూమి మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభంలో ఉంది” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఈ ప్రకృతి ప్రమాదాల నుంచి ప్రజలను, ప్రాణాలను కాపాడుకోవడానికి మానవాళి తక్షణమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Ramba Urvasi Menaka Review: చాలా రోజుల తర్వాత అల్లరోడి మార్క్‌ కామెడీ.. నవ్వించాడా? బోర్ కొట్టించాడా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *