బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ నుంచే ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని వెల్లడించారు. కాగా బిగ్ బాస్ తెలుగు ప్రతీ సీజన్‌లోనూ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఒక స్టార్ హీరో ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈసారి కూడా ఓ స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నారు. అతను మరెవరో కాదు ఊపిరి సినిమాలో కింగ్ నాగార్జునతో కలిసి నటించిన కోలీవుడ్ స్టార్ హీరో ‘కార్తీ’. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం కార్తి ‘సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటిన సింగర్ ఝాన్సీ హౌస్ కంటెంటర్ గా ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది. ఆమెతో పాటు మరో నలుగురు లేదే ఐదుగురు కంటెస్టెంట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే పల్లవి గౌడ, ముఖేష్ గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఫోక్ డ్యాన్సర్ మాథురీ రాథోడ్, దేబ్జానీ మోదక్.. తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెడతారో తెలియాలంటే ఆదివారం (సెప్టెంబర్ 6) వరకూ ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి
కింగ్ జమానాలోకి సర్దార్..
KING X SARDAR 👑💪
Macho Man @Karthi_Offl graces the launch episode of #BiggBossTelugu10 as Chief Guest🔥🔥🔥#Sardar2 Telugu promotions in full swing💥
In cinemas from September 10th ❤️🔥@Prince_Pictures @AnnapurnaStdios pic.twitter.com/wWNgtzU2jD
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి