నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒక్క నిమ్మకాయను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కొంత మంది రుచికరమైన వంటకాలకు ఉపయోగిస్తారు. మరి కొంత మంది తమ ఆరోగ్యం కోసం దీనిని డ్రింక్‌లా తీసుకుంటారు. అంతే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దీని పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. దిష్టి దోషం నుంచి తప్పిస్తుంది. ఇలా అనేక విధాలుగా నిమ్మకాయను ఉపయోగిస్తారు.
అయితే కొంత మంది నిమ్మకాయను అడ్డంగా కట్ చేస్తే మరికొంత మంది మాత్రం నిలువుగా కట్ చేస్తారు. కానీ చాలా మందికి దీనిని ఎలా కట్ చేయాలి అనే అవగాహన ఉండదు. కానీ మీరు ఉపయోగించే విధానం బట్టి, మీరు దేని కోసం నిమ్మకాయను వాడుతున్నారు అనేదానిబట్టి, నిమ్మకాయను కట్ చేసే విధానం ఉంటుందంట.
ఒక వేళ మీరు సలాడ్ కోసం నిమ్మకాయను ఉపయోగించడం లేదా ఫుడ్ గార్నిష్ లేదా టీ , వాటర్ , గ్లాస్ డెకరేషన్ కోసం గనుక నిమ్మకాయను ఉపయోగించాలి అనుకుంటే దానిని గుడ్రంగా ఉపయోగించాలంట. దాని వలన లుక్ బాగా కనిపిస్తుంది. అంతే కాకుండా రసం కూడా సరిపడ వస్తుంది.
అయితే మీరు పులిహోర సమయంలో, లేదా పప్పుల్లోకి, రసం చేసే సమయంలో, షర్బత్ చేసుకునే సమయంలో నిమ్మకాయను నిలువుగా కట్ చేయాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇలా కట్ చేయడం వలన గింజల పొడవుగా ఉంటాయి. దీంతో నిమ్మరసం పిండే సమయంలో రసం ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గింజలకు కూడా ఎక్కువగా రావు. అందుకే వంటకాల కోసం ఉపయోగిస్తే నిలువుగా కట్ చేయాలంట.
అంతే కాకుండా చాలా మంది ఫంక్షన్స్, ఈవెంట్స్‌లలో వాటిని సలాడ్‌గా తీసుకుంటారు. అయితే అటువంటి సమయంలో నిమ్మకాయను నాలుగు ముక్కలుగా నిలువుగా కట్ చేసి పెట్టాలంట. అంతే కాకుండా కొందరు వీటిని ఎక్కువగా ఫుడ్ డెకరేషన్ కోసం కూడా వాడుతుంటారు. అటువంటి సమయంలో గుడ్రంగా కట్ చేయడం మంచిదంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




