Dharmendra Pradhan: అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. బెంగాల్‌లో తారస్థాయికి చేరిన రాజకీయ సెగలు..

Dharmendra Pradhan: అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్.. బెంగాల్‌లో తారస్థాయికి చేరిన రాజకీయ సెగలు..


పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత బెంగాల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఘాటుగా స్పందించగా, దానికి ప్రతిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్ తన ట్వీట్‌లో తృణమూల్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తృణమూల్ నేతల భాష.. వారిలో పెరుగుతున్న నిరాశకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా ప్రజాస్వామ్యం, భద్రత, జవాబుదారీ పాలన గురించి మాట్లాడుతుంటే, అభిషేక్ బెనర్జీ మాత్రం బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఏళ్ల తరబడి బెంగాల్ ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్‌కు కావాల్సింది రాజకీయ చర్చలు, సమర్థవంతమైన నాయకత్వమే తప్ప, బలప్రదర్శన కాదని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. టీఎంసీ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలను బెంగాల్ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య మార్పు కోసం నిలబడాలనే వారి సంకల్పాన్ని ఇవి మరింత బలపరుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ గడ్డపై రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *