Sudigali Sudheer: ‘మాది దేవుడిచ్చిన బంధం’.. సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?

Sudigali Sudheer: ‘మాది దేవుడిచ్చిన బంధం’.. సుడిగాలి సుధీర్, ఇంద్రజ ఒకరినొకరు ఏమని పిల్చుకుంటారో తెలుసా?


ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు సినిమాల్లో సహాయక నటిగా రాణిస్తోంది. అలాగే బుల్లితెరపై టీవీ షోలు, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు ఆమె జడ్జ్ గా చేస్తున్నారు ఇంద్రజ. ఇదిలా ఉంటే తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది ఇంద్రజ. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ తో తన అనుబంధం ఎలాంటిదో చెప్పింది. ‘సిద్ధు (సుధీర్) నాకు కొడుకు లాంటివాడు. నన్ను అమ్మా అని పిలుస్తాడు. ఆ పిలుపునకు తగ్గట్టుగానే నాపై ఎంతో ప్రేమ, గౌరవం చూపిస్తాడు. అది చూసినప్పుడు ఇది దేవుడు ఇచ్చిన బంధంలా అనిపిస్తుంది. జబర్దస్త్ లో మమ్మల్ని తల్లీకొడుకులా చూసేవాళ్లు.
బయటకు వెళ్తే ఫ్యాన్స్ కూడా అదే అడుగుతుంటారు. కలిసి కనిపించడం లేదని, మా ఇద్దరిని మిస్ అవుతున్నామని అంటారు. ఇక నేను సుధీర్ ను సిద్ధు అని పిలుస్తా. అతనేమో నన్ను రాజీ అని అంటాడు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను రాజీ అనే పిలుస్తారు. సిద్దు నన్ను రాజీ అంటే సంతోషంగా అనిపిస్తుంది. సుధీర్ లో చాలా ట్యాలెంట్ ఉంది. కానీ అతను ఇంకా టాప్ లో లేడని అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. రాబోయే రోజుల్లో అతను చాలా బెటర్ ప్లేస్ కు చేరుకోవాలి’ అని ఆకాంక్షించింది ఇంద్రజ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 ఇంద్రజ డ్యాన్స్ వీడియో..

కాగా సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అతను నటించిన ది గోట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు కూడా సుడిగాలి సుధీర్ చేతిలో ఉన్నాయి. ఇక టీవీ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే.. జీ తెలుగులో ఆట, ఆహా ఓటీటీలో సర్కార్ షోలను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్.

 ఇంద్రజ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *