Headlines

Cyclone Akvan: ఏపీ ప్రజలకు అలర్ట్.. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!


అమరావతి: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్’ (Akvan Cyclone) తుఫాను క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న ఈ తుఫాను ప్రస్తుతం చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుఫాను ఇవాళ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుఫానుగా (Very Severe Cyclone) బలపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, విశాఖపట్నం మధ్య అక్వాన్ తుఫాను తీరాన్ని దాటనుంది.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విరుచుకుపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.

అక్వాన్ తుఫాను ప్రభావంతో గురువారం, శుక్రవారం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు తమ వ్యవసాయ పనుల విషయంలో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో సైతం గురువారం, శుక్రవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *