
ఐపీఎల్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో అందించిన 204 పరుగుల లక్ష్యాన్నికేవలం 5 వికెట్లు కోల్పోయి సాధించింది. చెన్నై తరపున ఉర్విల్ పటేల్ విరోచిత ఇన్నింగ్స్ (65)కు తోడు గైక్వాడ్ (42) కూడా తన వంతు సహకారం అందించాడు. అంతకుముందు చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఉర్విల్ పటేల్ 13 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి, వేగవంతమైన అర్ధశతకంలో రాజస్థాన్‌కు చెందిన యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు.