Headlines

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ పొరపాటు చేస్తే జీవితాంతం బాధపడతారు..


క్రెడిట్ కార్డులు ఇటీవల చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారు. గతంలో కొంతమంది ఉద్యోగులు, వ్యాపారుల దగ్గర ఇవి కనిపించేవి. ఇప్పటి రోజుల్లో చిరు ఉద్యోగి నుంచి విద్యార్థుల వరకు ఎవరి చేతుల్లో చూసినా కనిపిస్తున్నాయి. మన దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా సులువుగా పేమెంట్ చేయవచ్చు. అంతేకాకుండా అనేక డిస్సౌంట్స్, ఆఫర్లు కూడా వీటిపై లభిస్తాయి. దీంతో ఆఫర్ల కోసం చాలామంది వీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇక అద్దె చెల్లింపులు, ఇతర అవసరాలకు డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయనే కారణంతో క్రెడిట్ కార్డులను వాడేవారు కూడా ఉన్నారు. ఆఫర్లు, డిస్కౌంట్స్, షాపింగ్స్, ప్యూయల్ వంటి వాటికోసం కార్డును వాడుకోవడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. కానీ ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది.

ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఏటీఎం దగ్గర స్క్రాప్ చేసి నగదు తీసుకుంటారు. దీని వల్ల అదనపు ఛార్జీలు చాలా ఉంటాయి. ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డు ఉపయోగించి నగదు తీసుకుంటే క్యాష్ అడ్వాన్స్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇక ఇలాంటి లావాదేవీలకు వడ్డీ కూడా పెద్ద మొత్తంలో పడుతుంది. డబ్బులు విత్ డ్రా చేసిన క్షణం నుంచి వడ్డీ పడుతుంది. ఇక తిరిగి చెల్లించకపోతే 3.1 శాతం నుంచి 3.5 శాతం వరకు అదనపు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆలస్యపు ఫీజులు భారీగా పడటం వల్ల మీరు నష్టపోవాల్సి ఉంటుంది. సకాలంలో చెల్లించకపోతే మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది.

ఇక ఏటీఎం ద్వారా చేసే క్రెడిట్ కార్డు లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్‌లు లభించవు. మొత్తం క్రెడిట్ కార్డు లిమిట్‌లో 20 శాతం నుంచి 40 శాతం వరకు క్యాష్ అడ్వాన్స్ రూపంలో ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసేుకోవచ్చు. షాపింగ్స్ మాల్స్, ఇతర చోట్ల ఖర్చు చేసినప్పుడు 40 రోజుల పాటు ఎలాంటి వడ్డీ ఉండదు. కానీ ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసే ఆ బెనిఫిట్ అనేది ఉండదు. దీంతో ఏటీఎం ద్వాార విత్ డ్రా చేయకపోవడమే మంచిది. అత్యవసరమైతే తప్ప అలాంటి పని చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *