Cooling Indoor Plants: ఏసీ లేకపోయినా మీ ఇల్లు చల్లగా ఉండాలా? ఈ 6 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు!

Cooling Indoor Plants: ఏసీ లేకపోయినా మీ ఇల్లు చల్లగా ఉండాలా? ఈ 6 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు!


Cooling Indoor Plants: ఏసీ లేకపోయినా మీ ఇల్లు చల్లగా ఉండాలా? ఈ 6 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు!

కలబంద (Aloe Vera) మొక్క ఆరోగ్యానికే కాకుండా, ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది పగటిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ గాలిని శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు కాబట్టి, వేసవిలో తక్కువ నీటితో కూడా సులభంగా బ్రతుకుతుంది. అదేవిధంగా, పోకచెట్టు (Areca Palm) గదిలో తేమను పెంచి చల్లని అనుభూతిని కలిగిస్తుంది. ఇది సహజమైన హ్యూమిడిఫైయర్‌గా పనిచేస్తూ ఇంటిని పచ్చగా, తాజాగా ఉంచుతుంది.

స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ విశిష్టత
స్నేక్ ప్లాంట్ (Snake Plant) పెంచడం చాలా సులభం ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది మితమైన కాంతిలో బాగా పెరుగుతుంది.. కాబట్టి దీనిని పడకగదిలో ఉంచుకోవచ్చు. ఇక మనీ ప్లాంట్ (Money Plant) గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తగ్గించి ఇంటికి చల్లదనాన్ని, తాజాదనాన్ని అందిస్తుంది. దీనిని బాల్కనీలో వేలాడే కుండీలలో లేదా లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వల్ల కళ్లకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

పీస్ లిల్లీ, బోస్టన్ ఫెర్న్ ప్రాముఖ్యత
పీస్ లిల్లీ (Peace Lily) అనేది తక్కువ శ్రద్ధ అవసరమయ్యే అద్భుతమైన గాలి శుద్ధికారి అని నాసా అభివర్ణించింది. ఇది ఇంటి లోపల ఉండే బెంజీన్ ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన వాయువులను గ్రహించి తేమను పెంచుతుంది. చివరగా బోస్టన్ ఫెర్న్ (Boston Fern) మొక్క గాలిలోని కాలుష్య కారకాలను తొలగించి, అధిక తేమను విడుదల చేయడం ద్వారా పరిసరాలను చల్లగా ఉంచుతుంది. ఈ మొక్కకు ఎన్ని ఎక్కువ ఆకులు ఉంటే అంత ఎక్కువ చల్లదనాన్ని అందిస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *