Headlines

Cinema: థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టింది.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలో బ్లాక్ బస్టర్ మూవీ

Cinema: థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టింది.. ఓటీటీలో రికార్డు వ్యూస్.. ఇప్పుడు టీవీలో బ్లాక్ బస్టర్ మూవీ


బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో బ్లాక్బస్టర్ సినిమాతో రాబోతోంది. థియేటర్ వేదికగా ఘనవిజయం అందుకున్న కామెడీ హారర్ ‘రాకాస’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రసారం చేయనుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ ఈ ఆదివారం (జూలై 26), సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. మానస శర్మ దర్శకత్వంలో, నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాతలుగా రూపొందిన ‘రాకాస’లో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాకవర అనే కుగ్రామం, శాపానికి గురవుతుంది. అందువల్ల, ఆ గ్రామ ప్రజలు ఊరిలోని ఒక కోటలో ఉన్న బ్రహ్మ రాక్షసుడికి కొన్ని సంకేతాల రీత్యా ఒక ప్రాణాన్ని బలిగా పంపుతూ వస్తారు. అసలు యూఎస్ నుంచి అప్పుడే ఊరిలోకి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్) బలి ఉచ్చులో ఎలా ఇరుక్కున్నాడు? అసలా రాక్షసుడు ఎలా వచ్చాడు? చివరికి ఈ సమస్య ఎలా పరిష్కారం అయ్యింది? అనే విషయాలు తెలియాలి అంటే జీ తెలుగు వేదికగా ఈ సినిమా చూసేయాల్సిందే.

కాగా రాకాస సినిమాను రూ. 15కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 27 కోట్ల కు పైగ గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఓటీటీ డీల్ తోనూ ఈ సినిమా నిర్మాతలకు భారీ ఆదాయమే వచ్చింది. ఆకట్టుకునే స్క్రీన్ప్లే, కథ, కథనం, అద్భుతమైన సాంకేతిక అంశాలతో తెరకెక్కిన ‘రాకాస’ ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఒక ఉత్కంఠభరితమైన సినిమా అనుభవాన్ని అందించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కామెడీ హారర్ ‘రాకాస’.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో, తప్పక చూడండి!

ఇవి కూడా చదవండి



జీ తెలుగులో సంతోష్ శోభన్ రాకాస..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *