ఇంట్లో ఉండే గృహిణులకు జీతం లభించడం అరుదే. కానీ, దుబాయ్‌కి చెందిన సౌదీ అనే మహిళ గృహిణిగా ఉంటూనే ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఆమె భర్త, బిలియనీర్ వ్యాపారవేత్త జమాల్, ఆమెకు ప్రతి నెలా భారీ జీతంతో పాటు ప్రతి గర్భధారణకు ప్రత్యేకంగా రూ. 3 కోట్ల విలువైన బోనస్ ఇస్తున్నాడు. వీటితో పాటు లగ్జరీ షాపింగ్, బంగారం, ఖరీదైన కార్లను కూడా ఆమెకు కానుకగా ఇస్తుంటాడు. ఈ విలాసవంతమైన జీవనశైలిని సౌదీ తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
దుబాయ్‌కి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్త జమాల్‌ను సౌదీ వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. సౌదీ తన దైనందిన జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవలే ఆమె తన భర్త తనకు ఇచ్చే శాలరీ, ప్రెగ్నెన్సీ బోనస్ వివరాలను వెల్లడించడంతో ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి
ప్రతి గర్భధారణకూ కోట్ల విలువైన బోనస్!:
సౌదీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు భర్త జమాల్ ప్రతి నెలా నిత్య అవసరాలు, వ్యక్తిగత ఖర్చుల కోసం భారీ మొత్తంలో పాకెట్ మనీ లేదా జీతాన్ని ఇస్తాడు. అంతటితో ఆగకుండా, ఆమె గర్భం దాల్చిన ప్రతిసారీ ప్రెగ్నెన్సీ బోనస్ కింద సుమారు $300,000 నుండి $400,000 డాలర్లు మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2.5 కోట్ల నుండి రూ. 3.3 కోట్లు ఇస్తున్నాడు. ఇందులో ఖరీదైన డైమండ్ జ్యువెలరీ, డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్స్, కొత్త లగ్జరీ కార్లు కూడా భాగమై ఉంటాయి.
షాపింగ్, ఫైన్ డైనింగ్కే ప్రాధాన్యత:
ఆమె ఒక ఏడాదిలో షాపింగ్, విహారయాత్రలు, మేకప్, లగ్జరీ బ్రాండ్ల కొనుగోళ్ల కోసమే రూ. 10 కోట్లకు పైగా వెచ్చిస్తుందని సమాచారం. భర్త ఇచ్చే ఈ ఆర్థిక స్వాతంత్ర్యం, విలాసవంతమైన జీవితాన్ని ఆమె ఎంతో గర్వంగా సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంటుంది.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు:
ఈ వైరల్ కథనంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఇలాంటి జీవితం దొరకడం నిజంగా అదృష్టం అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం డబ్బుతో ప్రతిదాన్నీ కొలవలేం, ఇది కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ, గృహిణిగా ఉంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ మహిళ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..