Headlines

Cinema : ఇదెక్కడి సిరీస్ భయ్యా.. ఓటీటీలో రచ్చ రంభోలా.. ఆ ఒక్క ట్విస్టుతో మైండ్ బ్లాక్..


ఓటీటీ వేదికలపై భిన్నమైన కథాంశాలు, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందే వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొంది, మంచి ఐఎండీబీ రేటింగ్‌తో ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సిరీస్ ‘తాజా ఖబర్’ (Taaza Khabar). భువన్ బామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఫాంటసీ, థ్రిల్లర్, డ్రామా అంశాల మేళవింపుతో సాగుతూ బింజ్-వాచ్ చేసేలా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో భువన్ బామ్ వసంత్ పాత్రలో వైవిధ్యమైన నటనతో మెప్పించారు. తొలుత అమాయకంగా, సాధారణ వ్యక్తిగా కనిపిస్తూనే.. అధికారం చేతికి చిక్కిన తర్వాత మారే కోణాలను చక్కగా పండించారు. కీలక పాత్రల్లో శ్రియా పిల్గాంకర్, జె.డి. చక్రవర్తి, దేవెన్ భోజాని, శిల్పా శుక్లా, ప్రథమేష్ పరబ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించగా, అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్ రచన అందించారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

కథ విషయానికి వస్తే..

సాధారణ జీవితం గడిపే వసంత్ గవాడే అలియాస్ వస్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పేదరికం, కష్టాలతో సతమతమవుతున్న వస్య జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. తనకు లభించే ఒక విచిత్రమైన శక్తి ద్వారా భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందే తెలుసుకునే అవకాశం అతనికి వస్తుంది. ముందుగా తన కుటుంబం, స్నేహితుల జీవితాలను మార్చాలనుకునే వస్య.. క్రమంగా ఆ శక్తిని ఉపయోగించి డబ్బు, అధికారం వైపు అడుగులు వేస్తాడు. అయితే అతి ఆశ, అహంకారం కారణంగా ఆ వరం తనకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? తన బంధాలు, నమ్మకాలు ఎలా దెబ్బతిన్నాయి? అనేది ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

తక్కువ ఎపిసోడ్లతో వేగంగా సాగే కథనం, భవిష్యత్తును ముందుగా ఊహించే ట్విస్ట్‌లు, పాత్రల మధ్య నెలకొనే భావోద్వేగాలు ఈ సిరీస్‌కు ప్రధాన బలం. డబ్బు, అధికారం మనిషిని ఎలా మార్చగలవో చూపిస్తూనే, చివరి వరకు ఉత్కంఠను నిలబెట్టే అంశాలు సస్పెన్స్, థ్రిల్లర్ ప్రియులకు మంచి అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతుంది. త్వరలోనే ఈ సిరీస్ మూడో సీజన్ సైతం రాబోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *