BYD Leopard: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలతోనే (EV) సంచలనం సృష్టించిన బీవైడీ (BYD), ఇప్పుడు తన రూటు మార్చింది. ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా, మైలేజీ టెన్షన్ లేని ‘ప్లగ్-ఇన్ హైబ్రిడ్’ (PHEV) టెక్నాలజీతో సరికొత్త లియోపార్డ్ 8 (Leopard 8) SUVని భారత్‌లోకి తీసుకువస్తోంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే ఒక లగ్జరీ బీస్ట్.
ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంత తగ్గిందంటే..
టెక్నాలజీ, పవర్:
లియోపార్డ్ 8లో 2.0- లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు 36.8 kWh సామర్థ్యం గల ‘బ్లేడ్ బ్యాటరీ’ని అమర్చారు. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో ఇది ఏకంగా 748 hp శక్తిని, 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని పవర్ చూస్తుంటే ఇది రేసింగ్ కార్లకు ఏమాత్రం తీసిపోదని అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి
మైలేజీ, రేంజ్ అద్భుతం:
ప్యూర్ ఈవీ మోడ్: కేవలం బ్యాటరీ పవర్‌తో పెట్రోల్ అవసరం లేకుండానే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంటే సిటీలో ఆఫీసు పనులకు పెట్రోల్ ఖర్చే ఉండదు. మొత్తం రేంజ్ విషయానికొస్తే.. ఫుల్ ట్యాంక్ పెట్రోల్, ఫుల్ ఛార్జింగ్‌తో కలిపి ఈ SUV ఏకంగా 1200 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్‌కు వెళ్లగలదు.
పర్ఫార్మెన్స్, సైజ్:
ఈ భారీ SUV కేవలం 4.8 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. పరిమాణం విషయానికి వస్తే, ఇది టయోటా ఫార్చ్యూనర్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉండి రోడ్డుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది.
లగ్జరీ ఫీచర్లు:
లోపల 17.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం 50-అంగుళాల హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD) ఉన్నాయి. 18-స్పీకర్ ఆడియో సిస్టమ్ విషయానికొస్తే.. వైర్‌లెస్ ఛార్జింగ్, సురక్షితమైన ప్రయాణం కోసం అడ్వాన్స్‌డ్ ADAS ఫీచర్లు ఉన్నాయి. ఇది 6 లేదా 7 సీటింగ్ ఆప్షన్లతో లభించనుంది. అందుకే పెద్ద కుటుంబాలకు కూడా ఇది ఒక విలాసవంతమైన ఎంపిక. భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండింటి ప్రయోజనాలను అందించే ఈ హైబ్రిడ్ SUV ఒక గేమ్ ఛేంజర్ కానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి