బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో విజయవంతంగా రెండు వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో ఎప్పటిలాగే ఎలిమినేషన్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే వీకెండ్ ఎపిసోడ్స్ లో భాగంగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడుతున్నారు. తప్పులు చేసిన వారితో తనదైన శైలిలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మూడో వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు చాలా మంది ఓటింగ్ లో అట్టడుగున ఉన్న యాంకర్ వర్షిణీ హౌస్ నుంచి బయటకు వస్తుందనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరూ ఊహించని విధంగా ఓ టాప్ మేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నాడని సమాచారం. మూడో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి బిగ్ బాస్ 10 నామినేషన్స్ లో త్రిగుణ్, సుధీర్ రెడ్డి, అమన్, చరణ్, వంశీ, షాలిని, వర్షిణి, సింగర్ ఝాన్సీ ఉన్నారు. ప్రస్తుతమున్న ఓటింగ్ ట్రెండస్ ప్రకారం త్రిగుణ్ టాప్లో కొనసాగుతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా గత రెండు వారాలు బాటమ్ లో ఉన్న సుధీర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా టాప్ 2కి దూసుకొచ్చాడు. ఇక చరణ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టాప్-4 ప్లేస్ లో అమన్ ఉండగా, వంశీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరో ప్లేస్ లో వర్షిణీ ఉండగా, ఏడో ప్లేసులో షాలినీ, ఎనిమిదో స్థానంలో సింగర్ ఝాన్సీ ఉన్నారు. అయితే సింగర్ ఝాన్సీకి సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆమెకు రైతు బిడ్డ ట్యాగ్ కూడా ఉంది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక షాలినీ కూడా గేమ్ బాగా ఆడుతోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆమెకు మంచి సపోర్ట్ ఉంటోంది. ఇక మిగిలింది యాంకర్ వర్షిణీ, టెంపర్ వంశీ. ప్రస్తుతం వీరిద్దరి మధ్యనే ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతోంది. అయితే ఎలిమినేషన్ కు సంబంధించి వర్షిణి జస్ట్ లో మిస్ అయ్యిందని, వంశీ ఎలిమినేట్ అవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వంశీ ఎలిమినేట్ అయినట్టు పోస్టులు దర్శనమిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన సమాచారం మేరకు కూడా వంశీనే ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి