Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నుంచి శ్వేతా నాయుడు ఎలిమినేషన్‌కు కారణాలివే.. 5 వారాలకు ఎంత సంపాదించిందంటే?


Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నుంచి శ్వేతా నాయుడు ఎలిమినేషన్‌కు కారణాలివే.. 5 వారాలకు ఎంత సంపాదించిందంటే?

ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా పదో వారం పూర్తి చేసుకుంది. ఇక పదో వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ పదవ వారం నామినేషన్స్ లో భాగంగా ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, శ్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా శివకుమార్ చాలా లీస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రామకృష్ణ, నీతూ మాస్టర్ కూడా డేంజర్ పొజిషన్ లో ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. రామకృష్ణ ఎలిమినేట్ అయ్యారని డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతూ మాస్టర్ కూడా బయటకు వస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తాయి. అయితే అదేమీ జరగలేదు. అందరి అంచనాలకు భిన్నంగా శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ కు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

డీ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేత నాయుడు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి నుంచి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పోలిస్తే ఆమెకు బలమైన ఓటు బ్యాంకు లేదు. ఇక హౌస్‌లోకి వచ్చాక కూడా ఆమె పెద్దగా కంటెంట్ ఇవ్వలేకపోయింద. ఆటల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా కనిపించలేదు. ఏ ఒక్క టాస్కులోనూ రాణించకపోవడంతో, హౌస్‌మేట్స్ దృష్టిలో కానీ అటు ఆడియెన్స్ దృష్టిలో బలమైన ముద్ర వేయలేకపోయింది. ఇక ఇటీవల తోటి కంటెస్టెంట్ అమన్‌తో శ్వేతకు సాన్నిహిత్యం పెరగడం, అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకోవడం ఇతరత్రా కారణాల వల్ల శ్వేతనాయుడిపై నెగెటివిటీ ఏర్పడింది. ఇక పదో వారంలో హౌస్‌లోని సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉండగా శ్వేతకు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలపాటు కొనసాగిన శ్వేత నాయుడు పదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా వారానికి ఈమె 1.5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్. ఈ లెక్కన మొత్తం 5 వారాలకు గాను శ్వేత 7.5 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *