Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నుంచి పిలుపు వచ్చింది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై తేల్చేసిన టాలీవుడ్ హీరోయిన్


Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నుంచి పిలుపు వచ్చింది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై తేల్చేసిన టాలీవుడ్  హీరోయిన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా, రసవత్తరంగా సాగుతోంది. అయితే ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ రియాలిటీ షోలో ట్విస్టులు మాములుగా లేవు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడం, ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లడం చూస్తుంటే బిగ్ బాస్ షోను బాగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ట్విస్టులు నెక్ట్స్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తం 8 మంది ఈసారి హౌస్ లోకి రానున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. గ్ ‘అగ్ని పరీక్ష 2’ లో సత్తా చాటిన దీపక్ , మితిలేష్ , రామకృష్ణ , అపూర్వ, హీరోయిన్ సీరత్ కపూర్, సోనియా సింగ్, ఆషిక, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ తదితరులు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా రానున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. అయితే సీనియర్ నటి సురేఖా వాణి కూతురు, హీరోయిన్ సుప్రిత కూడా బిగ్ బాస్ తెలుగు 10లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా రానున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై సుప్రిత స్పందించింది. బిగ్ బాస్ లోకి వెళ్లడంపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

‘బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే విషయంలో మా అమ్మకు అంతగా నమ్మకం లేదు. బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభానికి ముందే నన్ను షోలోకి రావాలని సంప్రదించారు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నేను భావోద్వేగాలను సరిగ్గా నియంత్రించుకోగలనా లేదా అనే విషయంలో అమ్మ ఆందోళన చెందింది. ప్రస్తుతం నేను బిగ్ బాస్ లోకి వెళ్లడంపై ఆలోచించడం లేదు. అలాంటప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎలా హౌస్ లోకి వెళతాను. అమ్మకు ఇష్టం లేనందున ప్రస్తుతానికి బిగ్ బాస్ షోలోకి వెళ్లే ఆలోచనను విరమించుకున్నాను. అయితే నేను బిగ్ బాస్ షోలోకి వెళ్లిపోయినా.. నాకు మాత్రం ఆ రియాలిటీ షో అంటే చాలా ఇష్టం. ఈ కార్యక్రమానికి నేను చాలా పెద్ద అభిమానిని. బిగ్ బాస్ 10 షో లాంచింగ్ ఎపిసోడ్ సమయంలో నా ఫ్రెండ్స్ బయటకు పిలిచారు. కానీ బిగ్ బాస్ లాంఛ్ ఉందని రాలేనని చెప్పాను. నాకు వర్క్ పై ఎంత శ్రద్ధ ఉందో బిగ్ బాస్ షోపైనా అంతే శ్రద్ధ ఉంది’ అన తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రీత. తద్వారా బిగ్ బాస్ షోపై ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిపై ఉన్న గౌరవంతో ఈ రియాలిటీ షోకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందీ స్టార్ కిడ్.

టీవీ షోలో సుప్రిత..

 

View this post on Instagram

 

A post shared by Amardeep G 👑 (@amardeep_chowdary)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *