Headlines

Bigg Boss Telugu 10: జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. ‘టెంపర్’ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’, ‘హిట్ 2’, ‘దేవర’.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’లోనూ వంశీ నటించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వంశీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ  అసలు పేరు వంశీ. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

తాజాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ ఓ ఏవీ ద్వారా తన గురించి చెప్పుకొచ్చాడు. అమీర్ పేటలో కోచింగ్ అని చెప్పి ఫోటోలు దిగి కృష్ణ నగర్ లో, ఫిలిం నగర్ లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా అని చెప్పారు వంశీ. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ గా తన మొదటి జీతం రూ.600అని చెప్పారు వంశీ. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన వంశీ తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున పాటలకు స్టెప్పులేని నాగ్ ను ఆకట్టుకున్నాడు. మరి హౌస్ లో వంశీ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *