Headlines

Bigg Boss 10 Telugu : ఘోరంగా బలైపోయాడు.. సమాజంలో ఇలాంటి ఫేక్ మనుషులు ఉన్నారు.. ఆ కంటెస్టెంట్ పై ప్రభాకర్ వీడియో..


బిగ్ బాస్ సీజన్ 10.. ఈసారి తొలి రోజు నుంచే రచ్చ మొదలైంది. ముఖ్యంగా ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు జనాలకు విపరీతమైన విసుగు పుట్టిస్తున్న కంటెస్టెంట్ త్రిగుణ్. అనవసరమైన విషయాలకు గొడవలు చేసి పెద్ద పెద్దగా అరిచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. దీంతో హౌస్ లో శకుని లాంటి వాళ్లు ఉన్నారంటూ రోహిత్ కు చెప్తూ పరోక్షంగానే అన్నారు హోస్ట్ నాగార్జున. ఇక మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ సుధీర్‌పై సృష్టి, త్రిగుణ్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. చేయని తప్పుకు సుధీర్‌ను దారుణంగా అవమానించడం, అతడిపై చెత్త విసరడం వంటి సంఘటనలు చూసి ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఫేమ్, ప్రముఖ నటుడు ప్రభాకర్ ఈ ఘటనపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

సుధీర్‌కు తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ, సృష్టి , త్రిగుణ్‌ల ప్రవర్తనను ఎండగట్టారు. బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్ జస్ట్ “హమ్మయ్యా నాకు ఫ్రీడమ్ లభించింది” అని అనడాన్ని తప్పుగా అర్థం చేసుకుని సృష్టి, త్రిగుణ్ అతడి క్యారెక్టర్‌ను వేలెత్తి చూపడం సరికాదని ప్రభాకర్ అన్నారు. “నిన్నటి ఎపిసోడ్ చూసినప్పటి నుండి మనసులో నుంచి పోవట్లేదు. సాధారణంగా నేను ఇలాంటి వీడియోలు చేయను. కానీ సుధీర్ ఏ తప్పూ చేయకపోయినా అక్కడ దారుణంగా బలైపోయాడనిపించింది. కంటెంట్ కోసం లేదా అటెన్షన్ కోసమే సృష్టి అలా గొడవ చేసింది” అని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిగుణ్ రాక్షసానందం పొందుతూ, ఈ గొడవకు ఆజ్యం పోశాడని, త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్ వంటి వారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సుధీర్‌పై గుడ్డిగా ఎటాక్ చేశారని మండిపడ్డారు.

అరిచి గొడవ పెడితేనే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందనే భ్రమలో కంటెస్టెంట్లు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ సమాజంలోని పరిస్థితులను బిగ్ బాస్ హౌస్‌తో పోల్చారు. “సొసైటీలో కూడా నిజాయితీగా ఉండే వారి కంటే అబద్ధాలు చెప్తూ ఫేక్‌గా ఉండే వాళ్లకే ఎక్కువ మద్దతు దక్కుతోంది. బిగ్ బాస్‌లోనూ అదే రిఫ్లెక్ట్ అవుతోంది. అయితే నిజాయితీగా ఉన్న సుధీర్ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు” అని ధైర్యం చెప్పారు. గత సీజన్లు కొంత సెన్సిబుల్‌గా ఉండేవి, కానీ ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అయితే, ఈ అన్యాయమైన దాడి కారణంగా సుధీర్‌కు ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్‌లో సింఫతీ, సపోర్ట్ లభిస్తున్నాయి. అప్పటివరకు ఆటలో వెనుకబడిన సుధీర్.. ఒక్కసారిగా విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడని, అతడిని కిందకు పడేయాలని చూసిన సృష్టి, త్రిగుణ్‌లకే ఇది చెంపపెట్టులాంటిదని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ప్రభాకర్ వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *