Bellamkonda Sai Sreenivas: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

Bellamkonda Sai Sreenivas: తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌


టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన కొత్త జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.
కావ్యా రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి సరిగ్గా 11.05 గంటలకు కావ్యా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు సాయి శ్రీనివాస్. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్యా రెడ్డిల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సినీ , రాజకీయ ప్రముఖుల కోసం మే 01న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

కాగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ భార్య కావ్యా రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఆమె ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది కిష్కింధ పురి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ‘టైసన్‌ నాయుడు’, ‘హైందవ’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *