Donkey Milk: గాడిద పాలు విరగవు, పులిసిపోవా..? ప్రచారంలో ఉన్నట్లు ఇవి తాగితే మంచిదేనా..?
పాలు అంటే సాధారణంగా మనకు ఆవు, గేదె, మేక పాలు గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో గాడిద పాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గాడిద పాలు తొందరగా విరగవు.. పులవవు.. ఆరోగ్యానికి ఎంతో మంచివ అంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? గాడిద పాలు నిజంగానే పులవవా? ఇతర పాలతో…