
గ్రూప్-1 రిజల్ట్స్.. ఎస్సీ స్టడీ సర్కిల్‌కి 30 ర్యాంకులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. దాదాపు 30 మంది విద్యార్థులు ఫైనల్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరసింహా రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యార్థులు డెప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ వంటి ఉన్నత స్థానాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తామని, హాస్టల్,…