ఇరానీ చాయ్, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధులు.. ఇలా నగర ఖ్యాతిని ఇనుమడింపచేసే ఎన్నో వారసత్వ కట్టడాల్లో పర్షియన్ వాస్తు శైలి కనిపిస్తుంది. మొహర్రం ఇరాన్, హైదరాబాద్ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధి. దర్వాజ, ఖర్చు, మెహఫిల్, దావత్ వంటి పర్షియన్ పదాలు ఇక్కడి ఉర్దూ, తెలుగులో కలిసిపోయి భాషలను సుసంపన్నం చేసాయి. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం అక్కడి నుంచి వచ్చినవే. ఇరానీ కేఫ్‌లు, బిర్యానీ హోటళ్లు సైతం 20వ శతాబ్దం తొలినాళ్లలో…