సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా చూశారో మీకే నష్టం..
శరీరానికి సబ్జా రక్షణ కవచం: వేసవిలో మన శరీరం చెమట రూపంలో నీటిని, ఖనిజ లవణాలను వేగంగా కోల్పోతుంది. దీనివల్ల తలతిరుగుడు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే మన వంటింట్లో దొరికే సబ్జా గింజలు అత్యుత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అద్భుత ప్రయోజనాలు: సబ్జా గింజలకు శరీరాన్ని తక్షణమే చల్లబరిచే గుణం ఉంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. ఈ గింజలు నీటిని పీల్చుకుని జెల్ లాగా…