కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..
సూర్యాపేట జిల్లా బరకత్ గూడెంకు చెందిన రామయ్యకు రైస్ మిల్ తో జీవనోపాధి పొందుతున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఈ వానరుల దాడి నుంచి మిల్లుకు వచ్చే ధాన్యం, బియ్యాన్ని రక్షించుకునేందుకు ఏపీలోని నూజివీడు నుండి కొద్ది రోజుల క్రితం కొండముచ్చును కొనుగోలు చేశాడు. అక్కడినుంచి కొండముచ్చును బరకత్ గూడేనికి తీసుకువచ్చి.. పెంచుకుంటున్నాడు.. కొద్దిరోజులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. ఇటీవల కొన్నీ రోజులుగా తిండి తినకపోవడంతో నీరసంగా కనిపించింది. ఉన్నట్టుండి కొండముచ్చు శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. కంగారు…