Assembly Election Exit Poll Results 2026: తుది దశకు బెంగాలో రెండో దశ పోలింగ్.. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్‌ పోల్స్

Assembly Election Exit Poll Results 2026: తుది దశకు బెంగాలో రెండో దశ పోలింగ్.. కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్‌ పోల్స్


అయితే బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌లో దాదాపు తుది దశకు చేరుకుంది. తొలి దశలో మాదిరి ఇప్పుడు కూడా బెంగాల్‌లో బంపర్‌ ఓటింగ్‌ నమోదయ్యే అవకాశాలున్నాయి. 90 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలున్నాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 79 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

అయితే ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ గుర్తుపై టేప్‌ అతికించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ టేప్‌ ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని , అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే అక్కడ రీపోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

అయితే ఈ పోలింగ్‌లో రాజకీయా నేతలు, సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా తాను పోటీ చేస్తున్న భవానీపూర్‌లో ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం బలగాలు ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీదే గెలుపన్నారు. పోలింగ్‌ బూత్‌ దగ్గర విక్టరీ సంకేతాన్ని చూపించారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *