శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ

శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ


పెనుగొండ లోని ప్రముఖ ఆర్య వైశ్యుల పుణ్యక్షేత్రం శ్రీ వాసవీ మాత కు భక్తులు తమకు తోచిన విధంగా విలువైన కానుకలు సమర్పిస్తూ తమ తమ భక్తిని చాటుకుంటుంటారు. అదే విధంగా రేపల్లె కు చెందిన మహిళా సంఘం సభ్యులు తమ 102 ఋషి గోత్రాల నామాలతో ప్రత్యేకంగా రూపొందించిన భారీ రుద్రాక్ష మాలను శ్రీ వాసవీ మాతకు సమర్పించారు. మొదట ఆలయ ప్రాంగణానికి మాలను తీసుకువచ్చిన మహిళా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య 90 అడుగుల పంచ లోహ విగ్రహానికి ఆ రుద్రాక్ష మాలను అలంకరించారు. ఈ ఆధ్యాత్మిక దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. శ్రీశ్రీ వాసవీ మాత ఆశీస్సులతో సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో భక్తి భావాన్ని నింపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *