స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుధ్ రవిచందర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సన్ టీవీ గ్రూప్స్ అధినేత కళానిధి మారన్ వన్ అండ్ ఓన్లీ డాటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మారన్ తో కలిసి అనిరుధ్ కొత్త జీవితం ప్రారంభించాడు. వీరి వివాహం నవంబర్ 10 ,11 తేదీలలో గ్రీస్ వేదికగా అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పోతే తాజాగా చెన్నైలో అనిరుధ్- కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం అనిరుధ్- కావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారనే వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. కావ్య మారన్ దాదాపు వేల కోట్లకు వారసురాలు. ఈ నేపథ్యంలో ఆమె వివాహం కోసం తండ్రి కళానిధి మారన్ వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. గ్రీస్ వేదికగా జరిగిన కావ్య- అనిరుధ్ ల గ్రాండ్ వెడ్డింగ్ కోసం సుమారు రూ.100 కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా చెన్నైలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం.
మొత్తానికి ఓవరాల్ గా కావ్య- అనిరుధ్ మారన్ ల వివాహపు వేడుక కోసం సుమారు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే అనిరుధ్- కావ్యల రిసెప్షన్ కు అతిరథ మహారథులు తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి, అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, కార్తీ, క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని భువనేశ్వర్ కుమార్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నటులు కార్తి, సిద్ధార్థ్, అదితి రావు, దర్శకుడు అట్లీ తదితరులు కూడా అనిరుధ్-కావ్య మారన్ వివాహ రిసెప్షన్లో సందడి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అనిరుధ్, కావ్య మారన్ల వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఆమె రాసిన లేఖలో, వివాహానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, కళానిధి మారన్, అతని కుటుంబానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.