Headlines

Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు

Anil Ravipudi: ఇండస్ట్రీలో వాడు  నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు


దర్శకుడు అనిల్ రావిపూడి తన సినీ ప్రయాణం, నటులతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఐడ్రీమ్ బాపట్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రారంభ రోజుల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో నటులు తనను ఇల్-ట్రీట్ చేయడం వంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, తాను “యూజర్ ఫ్రెండ్లీ” స్వభావం కలవాడినని తెలిపారు. ఒక రచయితగా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఏకకాలంలో పనిచేయడం తనకు ఎంతో మేలు చేసిందని ఆయన వివరించారు. నటులు డైలాగులు మార్చడంలో లేదా మెరుగుపరచడంలో తనతో ఎక్కువ సమయం గడిపేవారని, రైటింగ్ అనేది తనకు ఎప్పుడూ ఒక కవచంలా నిలిచిందని అనిల్ పేర్కొన్నారు.

ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

నటులతో తన అనుబంధం గురించి చెబుతూ, శ్రీనివాసరెడ్డితో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే శ్రీనివాసరెడ్డి తనకు చాలా దగ్గరని, అందుకే తన సినిమాల్లో ఆయనకు ఎప్పుడూ ఒక చిన్న స్పెషల్ రోల్ ఉంటుందని అనిల్ రావిపూడి తెలిపారు. ఇది తన సినీ ప్రయాణంలో నటులతో ఏర్పడిన దృఢమైన బంధానికి నిదర్శనమని ఆయన అన్నారు. అలాగే, నటుడు సప్తగిరితో తనకున్న స్నేహం గురించి కూడా అనిల్ రావిపూడి మాట్లాడారు. ఇద్దరూ “ఒరేయ్ ఒరేయ్” అని పిలుచుకునేంత మంచి స్నేహితులని ఆయన స్పష్టం చేశారు. అయితే, సప్తగిరి తన సినిమాల్లో ఎక్కువ కనిపించకపోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.

ఇది కూడా చదివేయండి : RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

సప్తగిరి కేవలం ఒకటి రెండు సీన్లు అయితే చేయనని అంటాడని, పూర్తి నిడివి గల, అతనికి తగ్గ మంచి పాత్ర వచ్చినప్పుడు మాత్రమే చేస్తానని చెబుతాడని అనిల్ రావిపూడి తెలిపారు. అందుకే అలాంటి పాత్ర దొరికినప్పుడు తప్పకుండా తీసుకుంటానని ఆయన అన్నారు. ఒకటి రెండు మంచి ఎపిసోడ్‌లైనా పర్లేదని సప్తగిరి కూడా ఆలోచిస్తే బాగుంటుందని ఆయన సరదాగా అన్నారు. సప్తగిరికి తాను ఎలా అవకాశం ఇచ్చింది కూడా అనిల్ రావిపూడి వెల్లడించారు. కందిరీగ చిత్రంలో “యాడికి పోయేది” అనే ట్రాక్ కోసం తాను ఒక సీను రాసుకున్నానని, దానిని తానే చేయాలనుకున్నానని తెలిపారు. అయితే, అది తన ప్రొఫెషన్ కాదని, అప్ కమింగ్ నటుడికి అవకాశం ఇస్తే సహాయపడుతుందని భావించి, అప్పటి డైరెక్టర్ వాసుగారితో మాట్లాడి, ఆ పాత్రను సప్తగిరికి అప్పగించానని అనిల్ రావిపూడి గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *