Headlines

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?


ఐస్ క్రీమ్ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన ఆహారం. వేసవిలోనే కాకుండా, వర్షాకాలంలో, చల్లని వాతావరణంలో కూడా చాలా మంది ఐస్ క్రీమ్ తింటారు. కానీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొన్ని అలవాట్లను పాటిస్తే, గొంతు నొప్పి, దగ్గు, అజీర్ణం, నోటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ క్రీమ్ తినడం వల్ల గొంతు నొప్పి రాదు. ఇప్పటికే వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గొంతు సమస్యలు ఉన్నవారిలో చల్లని ఆహారాలు తాత్కాలికంగా అసౌకర్యాన్ని పెంచుతాయి. అందువల్ల సరైన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి నీళ్ళు తాగొద్దు

చాలా మంది ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వేడి నీళ్ళు తాగుతారు. కానీ ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు దంతాల ఎనామెల్‌కు ఇబ్బంది కలిగించవచ్చు. దంతాల సున్నితత్వాన్ని పెంచవచ్చు. కొన్నిసార్లు విరేచనాలకు కూడా కారణం కావచ్చు. అందుకే కనీసం 10–15 నిమిషాలు ఆగి, ఆ తర్వాత మామూలు లేదా గోరువెచ్చని నీటిని తాగండి.

నోటిని శుభ్రంగా పుక్కిలించాలి

ఐస్ క్రీమ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అది తిన్న తర్వాత నోరు పుక్కిలించకపోతే, బ్యాక్టీరియా పెరిగి, దంతక్షయం, దుర్వాసన, పాచి వంటి సమస్యలకు దారితీస్తుంది. మామూలు నీటితో నోరు పుక్కిలించండి. వెంటనే పళ్ళు తోముకోవడానికి బదులుగా, సుమారు 30 నిమిషాలు ఆగి పళ్ళు తోముకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి



తిన్న వెంటనే నిద్రపోవద్దు

రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీమ్ తిని వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించవచ్చు. కొంతమందికి అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కనీసం 30–45 నిమిషాల పాటు పడుకోవద్దు. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినకపోవడమే మంచిది.

ఒకేసారి చాలా చల్లని ఆహారాలు తినవద్దు

శీతల పానీయాలు, చల్లటి నీరు, ఫ్రిజ్ నుండి తీసిన పండ్లు, ఐస్ క్రీమ్ వంటి భారీ ఆహారాలు అధికంగా తినడం వల్ల కొంతమందికి గొంతు అసౌకర్యం పెరగవచ్చు.

మీకు గొంతు నొప్పి ఉంటే ఈ కింది జాగ్రత్తలు అవసరం

మీకు గొంతులో చికాకు అనిపిస్తే.. గొంతు ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ వాపు, లేదా జ్వరం ఉన్నట్లయితే, ఐస్ క్రీమ్ తినే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

  • ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి.
  • పుష్కలంగా నీళ్లు తాగాలి.
  • లక్షణాలు కొనసాగితే, వైద్యుడిని సంప్రదించాలి.

ఐస్ క్రీమ్ తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

  • విశ్వసనీయమైన బ్రాండ్ ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి.
  • కరిగిన ఐస్ క్రీమ్‌ను తిరిగి గడ్డకట్టించి తినవద్దు.
  • మధుమేహం ఉన్నవారు తక్కువ చక్కెర ఉన్న ఆహారాలను ఎంచుకోవడం లేదా వైద్యుడు సలహా ఇచ్చినట్లుగా తినడం మంచిది.
  • లాక్టోస్ అసహనం ఉన్నవారు పాల ఉత్పత్తులు లేని ప్రత్యామ్నాయాలను పరిగణించవచ్చు.
  • పిల్లలకు మితంగా మాత్రమే ఇవ్వాలి.

నోట్: ఈ వ్యాసం కేవలం సాధారణ ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే. ఐస్ క్రీమ్ తినడం వల్ల గొంతు నొప్పి వస్తుందనడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినప్పటికీ ముందు నుంచే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహార ఎంపికలు చేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *