Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..


ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ నుంచి అవకాశం కల్పించనుంది. ఆ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ముందుగా వితంతువులు, దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత వృద్దాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. దీంతో ఆ రోజు నుంచి వితంతు పింఛన్లను మంజూరు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో 1.53 లక్షల మంది వితంతు పింఛన్ కోసం అర్హత సాధించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీళ్లు పింఛన్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు రెడీ అవుతుండటంతో.. వారందరికీ లబ్ది చేకూరనుంది.

తొలుత వితంతు పింఛన్లు జారీ

1.53 లక్షల మందికి పింఛన్లు అందించాలంటే నెలకు రూ.61 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ముందుగా వితంతువులకు పింఛన్లు మంజూరు చేయనుండగా.. ఆ తర్వాత దివ్యాంగులకు అందించనుంది. దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 28 కేటగిరీల్లో ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తోంది. వీటికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది. వీరందరికీ పింఛన్లను ఇవ్వాలంటే నెలకు రూ.400 కోట్ల వరకు ఖర్చు కానుంది. అంటే ఏడాదికి రూ.4,800 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే అంచనాలను సిద్దం చేసుకుని కొత్త పింఛన్లను జారీ చేయాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో 6.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక లక్ష మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో వీరి పింఛన్లను తొలగించడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.

అన్నీ ఆన్‌లైన్ ద్వారానే..

ఇప్పటికే సదరం సర్టిఫికేట్ల జారీని డిజిటల్ విధానంలో ప్రభుత్వం జారీ చేసింది. స్లాట్ల బుకింగ్, సర్టిఫికేట్ల జారీని ఆన్‌లైన్ చేసింది. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా సదరం సర్టిఫికేట్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. వైద్య పరీక్షల కోసం ఒక టైమ్ కేటాయిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆ టైమ్‌కి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లోనే సదరం సర్టిఫికేట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతంలో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఆఫ్‌లైన్ విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల ప్రక్రియ ఆలస్య అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *