Ustaad Bhagat Singh: అదొక్క మార్పు చేసి ఉంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా బాగా ఆడేది.. పవన్ సినిమాపై పరుచూరి

Ustaad Bhagat Singh: అదొక్క మార్పు చేసి ఉంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా బాగా ఆడేది.. పవన్ సినిమాపై పరుచూరి


పవర్ స్టార్ పవన్ ‌కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చిలో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది. అయితే పవన్ కల్యాణ్ అభిమానులను బాగానే ఆకట్టుకున్న ఉస్తాద్ సినిమా కామన్ ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ‘పరుచూరి పాఠాలు’ లో భాగంగా పవన్ సినిమాల్లోని స్క్రీన్‌ప్లే దోషాలను వివరించారు. అలాగే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే పవన్ సినిమా ఇంకా బాగా ఆడేదని అభిప్రాయపడ్డారు. ‘పవన్‌ కల్యాణ్ అంటే నాకు ఎంత అభిమానమో మీ అందరికీ తెలుసు. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ విడుదలైన తర్వాత థియేటర్‌లో చూద్దామనుకున్నా. కానీ ఆరోగ్యం సహకరించలేదు. సినిమా పేరు గంభీరంగా ఉంది. స్వరాజ్యం, సమాజం కోసం పోరాడిన వ్యక్తి పేరు పెట్టారు. కానీ సినిమా చూసిన తర్వాత కథ, కథనాలు మెయిన్‌ పాయింట్‌ నుంచి పక్కకు వెళ్లాయా? అనిపించింది. అనన్యను చంపేయడం అనేది ఒక షాకింగ్‌ పాయింట్. ప్రేక్షకులు వచ్చి సీట్లలో కూర్చోక ముందే ఆ సీన్‌ వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి రెండు రకాల ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లతో ఈ కథ నడిచింది. పవన్ కల్యాణ్‌ బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కమర్షియాలిటీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. పోలీస్‌ ఆఫీసర్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ, ఇందులో పవన్‌ చాలా మందిని కాల్చేసినట్లు చూపించారు. ఈ విషయంలో హరీశ్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకుని, సాధారణ విలన్‌లను కాకుండా ఉగ్రవాదుల్ని తీసుకొచ్చాడు. దీంతో కాల్చింది తప్పు కాదన్న భావన ప్రేక్షకుడిలో కలిగించాడు. ఇక ఉస్తాద్ పోలీస్‌ ఆఫీసర్‌ మాత్రమే కథ కాదని చెప్పేలా సెకండాఫ్‌లో ఒక ప్రేమ కథను కూడా జోడించారు. అయితే ఇక్కడే చిన్న పొరపాటు చేశారు. ప్రథమార్ధంలో యాక్షన్‌ పార్ట్ ఎక్కువగా ఉంది. కాబట్ట సెకండాఫ్ లో లవ్‌సీన్స్ పెద్దగా చూడబుద్ది కాలేదు. కొంత లవ్‌స్టోరీని ఫస్ట్‌ హాఫ్‌లో వాడుకోవాల్సింది.

హీరో ఎంట్రీ లేటవ్వకూడదు..

పవన్‌ లాంటి స్టార్‌ హీరో మూవీని చూడటానికి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఎప్పుడు హీరోను చూద్దామా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల తర్వాత కూడా పవన్ కనిపించరు. హీరో ఎంట్రీ లేటైతే, సినిమాకు ప్రమాదం. ఇక పార్తిబన్‌ను విలన్‌గా ఒప్పించడం సాహసమనే చెప్పుకోవచ్చు. ఆ పాత్రను ముగించిన తీరు కూడా బాగుంది. సాధారణంగా ఇలాంటి కథలు రాసుకున్నప్పుడు టైటిల్స్‌ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇందులో పవన్‌ పాత్ర కాస్త రౌడీ ఇన్‌స్పెక్టర్‌ను పోలి ఉంటుంది. ‘భగత్‌ సింగ్‌’ స్వరాజ్యం కోసం పోరాటం చేసి, ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఈ మూవీకి ఇంకేదైనా పేరు పెట్టి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన మరోలా ఉండేదేమో ‘ అని తన దైన శైలిలో విశ్లేషించారు పరుచూరి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

</h3>

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *